జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా నుంచి మార్కెట్లో విడుదల కానున్న
ఇవాలియా ఎమ్‌పివి ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉంది.
కంపెనీ ఇటీవల మీడియాకు ప్రదర్శించిన నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి సెప్టెంబర్
నెలలో వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ మోడల్
ఉత్పత్తిని చెన్నైలోని రెనో-నిస్సాన్ ప్లాంటులో ప్రారంభించినట్లు
తెలుస్తోంది.
విశాలమైన ఇంటీరియర్ స్పేస్ కలిగిన నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి ఈ సెగ్మెంట్లోకి తాజాగా వచ్చిన మారుతి సుజుకి ఎర్టిగా, ఎమ్‌పివి సెగ్మెంట్ లీడర్‌గా ఉన్న టొయోటా ఇన్నోవా, చెవర్లే తవేరా నియో3, మహీంద్రా జైలో వంటి వాహనాలకు గట్టి పోటీగా నిలువనుంది. నిస్సాన్ ఇవాలియా తొలుత డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. ఈ ఎమ్‌పివికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం ప్రత్యేకం..:
ఇంజన్ స్పెసిఫికేషన్లు:
నిస్సాన్ ఇవాలియాలో 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1900 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) కలిగిన నిస్సాన్ ఇవాలియా లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీనిస్తుంది.
నిస్సాన్ ఇవాలియా మొత్తం బరువు 1426 కేజీలు. ఇది 4400 మి.మీ. పొడవును, 1695 మి.మీ. వెడల్పు, 1880 మి.మీ. ఎత్తును మరియు 180 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. నిస్సాన్ ఇవాలియాలో ఆరుగురు ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. వెనుక వరుసలలో ఉండే రెండు సీట్లను పూర్తిగా మడిచినట్లయితే 2900 లీటర్ల వరకూ బూట్ స్పేస్ లభిస్తుంది.
సేఫ్టీలో ఇవాలియా ది బెస్ట్:
భద్రతా ఫీచర్ల విషయంలో కూడా నిస్సాన్ ఇవాలియా భేష్ అనిపించుకుంటుంది. ఇందులో ఫ్రంట్ సీట్లలోని డ్రైవ్ ప్యాసింజర్ కోసం డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ (బేస్ ఎక్స్ఈ వేరియంట్ మినహా), ముందు వైపు డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్, బ్రేక్ అసిస్ట్ మరియు ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇంజన్ ఇమ్మొబిలైజర్, డోర్లు సరిగ్గా వేయకపోతే హెచ్చరించే డోర్ అజర్ వార్నింగ్ వంటి సురక్షితమైన ఫీచర్లు ఉన్నాయి.

No comments:
Post a Comment