Read In Tollywood Latest News

Wednesday, August 29, 2012

క్రికెట్‌‌కు ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ స్టాస్ గుడ్ బై....

England Test Captain Andrew Strauss Retires

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ నెంబర్ వన్ స్దానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ అంతర్జాతీయ క్రికెట్ నుండి ఈరోజు (బుధవారం) రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 2009 నుండి టెస్టు క్రికెట్‌కు సేవలందించిన ఆండ్రూ స్ట్రాస్ హాయాంలో ఇంగ్లాండ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు, ఇంగ్లాండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరిస్‌లో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఆండ్రూ స్ట్రాస్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటించడంతో వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న అలెస్టర్ కుక్ టెస్టు జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

35 సంవత్సరాల వయసు కలిగిన ఆండ్రూ స్ట్రాస్ న్యూస్ కాన్పరెన్స్‌లో మాట్లాడుతూ గత కొన్ని వారాలు నుండి ఆలోచించి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీతో పాటు, అంతర్జాతీయ క్రికెట్ నుండి అన్ని ఫార్మెట్ల నుండి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నానని అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కఠిన నిర్ణయమైనప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టుకి మరియు నాకు మేలు చేసేదిగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నాడు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా చేతిలో 2-0తో పరాజయం పాలవ్వడంతో పాటు టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ ర్యాంకింగ్‌ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరిస్ మొత్తం మీద ఆండ్రూ స్ట్రాస్ 17.83 యావరేజి చొప్పున, 37 అత్యధిక పరుగులుగా నమోదు చేశాడు. ఆండ్రూ స్ట్రాస్ రిటైర్ మెంట్‌కు ఇది కూడా ఒక కారణం అయ్యిఉండోచ్చునని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అసభ్య మేసేజ్‌లు పంపాడని మూడవ టెస్టు నుండి తప్పించిన విషయం తెలిసిందే. 2009 నుండి ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆండ్రూ స్ట్రాస్ అసమాన విజయాలను జట్టుకి అందించాడు. మొదటిది ఆసీస్‌పై యాషెస్ సిరిస్ గెలవడం.. రెండవది ఇంగ్లాండ్‌ని టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్దానంలో నిలబెట్టడం. దీనితో పాటు స్వదేశంలో టీమిండియాపై 4-0తో వైట్ వాష్ విజయాన్ని సాధించాడు.

ఆండ్రూ స్ట్రాస్ టెస్టు కెప్టెన్సీ నుండి రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌కు టెస్టు జట్టులో మార్గం సుగమనం అవుతందని అందరూ భావిస్తున్నారు.

No comments:

Post a Comment