Read In Tollywood Latest News

Sunday, August 12, 2012

యువీ మ్యాచ్ విన్నర్: కృష్ణమాచారి శ్రీకాంత్.....

Yuvraj Singh Is Match Winner Says Srikkanth
ట్వంటీ20 ప్రపంచ్ కప్‌ను గెలుచుకునే అవకాశాలు యువరాజ్ సింగ్‌ను తీసుకోవడం వల్ల పెరుగుతాయని బిసిసిఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ప్రపంచ కప్ పోటీలు వచ్చే నెలలో శ్రీలంకలో ప్రారంభం కానున్నాయి. కొద్ది గంటల చర్చల అనంతరం శ్రీకాంత్ భారత జట్టును ప్రకటించారు. జట్టులోకి యువరాజ్ సింగ్‌ను తీసుకోవడంపై మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టిందని, ట్వంటీ20 ప్రపంచ కప్‌కు సిద్ధం కావడంపై తాము విస్తృతంగా చర్చించామని ఆయన చెప్పారు. స్టైలిష్ ఎడమ చేతివాటం క్రికెటర్ యువరాజ్ సింగ్ మ్యాచ్ విన్నర్ అని ఆయన అన్నారు. యువీ జట్టులో ఉండడం వల్ల ప్రపంచ్ కప్‌ను గెలుచుకునే అవకాశాలు భారత్‌కు పెరుగుతాయని ఆయన అన్నారు.

యువరాజ్ సింగ్ 2007 ట్వంటీ20 ప్రపంచ్ కప్‌లో, 2011 ప్రపంచ్ కప్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడని ఆయన గుర్తు చేశారు. యువరాజ్ సింగ్ ఉండడం కీలకమైన అంశమని, యువరాజ్ తిరిగి జట్టులోకి రావడం తమకు సంతోషంగా ఉందని, యువీ చేసిన శ్రమను తాము ప్రశంసిస్తున్నామని ఆయన అన్నారు.
ట్వంటీ20 ప్రపంచ కప్‌కు ఎంపికైన జట్టు ఉత్తమమైందని, సమతుల్యత కలదని ఆయన అన్నారు. తాము ప్రపంచ కప్ గెలవాలని అనుకుంటున్నామని, అందుకు ఇది మంచి జట్టు అని ఆయన అన్నారు ఇది చివరి అంతర్జాతీయ జట్టు ఎంపిక కావచ్చునని ఆయన అన్నారు.

No comments:

Post a Comment