
మరోవైపు.. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) ఈనెలాఖరులో తెలంగాణ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు పలికిన అన్ని రాజకీయ, ఉద్యోగ, ప్రజా సంఘాలను పాలు పంచుకునేలా చేసేందుకు టీ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ మార్చ్‌కు ముందుగానే టీఆర్ఎస్ కార్యాచరణకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే, తాము ప్రకటించబోయే కార్యాచరణలో టీ జేఏసీని, ఉద్యోగ సంఘాలు కూడా భాగం పంచుకునేలా చేయాలా వద్దా అనే అంశంపై తీవ్రస్థాయిలోనే చర్చ సాగుతోంది. అలాగే, కేసీఆర్ ప్రకటించబోయే.. కార్యాచరణ ఏవిధంగా ఉంటుందన్న అంశంపైనా చర్చ సాగుతోంది. ఆయన మళ్లీ ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి.. సామూహిక సమ్మెకు పిలుపునిస్తారా లేదా తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ ప్రాంత బంద్‌కు పిలుపునిస్తారా అనేది తేలాల్సి ఉంది. మొత్తంమీద కేసీఆర్.. తాను అనుకున్న లక్ష్యం కోసం ఎలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతారో వేచిచూడాల్సిందే.
No comments:
Post a Comment