Read In Tollywood Latest News

Wednesday, July 18, 2012

ప్రణబ్‌కే వైయస్ జగన్ ఓటు: వైయస్సార్‌సిపి నిర్ణయం.......


 Ys Jagan Vote Pranab
చంచల్‌గుడా జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకే ఓటు వేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో హమీద్ అన్సారీకి మద్దతు ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బుధవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ సమావేశానంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తటస్థంగా ఉండబోదని ఆయన చెప్పారు. రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయని, వాటిలో తమ ప్రాధాన్యం ప్రణబ్ ముఖర్జీకి ఇస్తున్నామని ఆయన అన్నారు. పార్టీరహితంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే తాము ప్రణబ్ ముఖర్జీకి మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందరి అభిప్రాయం తీసుకునే ప్రణబ్ ముఖర్జీకి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఓటేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఓటు వేయకపోవడం ప్రజాస్వామిక విరుద్ధంగామని, స్వతంత్రంగా, న్యాయంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే తాము ప్రణబ్ ముఖర్జీకి ఓటేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాము తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి గురించి మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. ఒప్పందం చేసుకోవడం వల్లనే ప్రణబ్‌కు మద్దతు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రస్తావించగా ఏం ఒప్పందం చేస్తారు, దానికీ దీనికీ ఎందుకు ముడిపెడుతారని, వైయస్ జగన్ కేసు కోర్టులో ఉందని ఆయన అన్నారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సిబిఐని పనిముట్టుగా వాడుకుంటున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు డాక్టర్ ఎంవి మైసురా రెడ్డి అన్నారు. దర్యాప్తు సంస్థ, న్యాయవ్యవస్థ వేర్వేరని ఆయన అన్నారు. వైయస్ జగన్ కేసుకు సంబంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని ఆయన అన్నారు. అభ్యర్థులను తిరస్కరించడమనే ప్రత్యామ్నాయం ఎన్నికల్లో లేదని, ఎటో ఒక వైపు ఓటేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వైయస్ జగన్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటర్లు ప్రథమ ప్రాధాన్య ఓటును ప్రణబ్ ముఖర్జీకి వేయనున్నారు.

వైయస్ జగన్‌కు 15 రోజుల్లో బెయిల్ వస్తుందనే వైయస్ విజయమ్మ మాటలు యాదృచ్ఛికమేనని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కోర్టులను ప్రభావితం చేస్తందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. జగన్ కేసు కోర్టు పరిధిలోదని, కాంగ్రెసు పార్టీ ప్రమేయం లేదని ఆయన అన్నారు. తాము కాంగ్రెసుతో లోపాయికారి ఒప్పందం జరిగిందనే మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు.

No comments:

Post a Comment