Read In Tollywood Latest News

Monday, July 30, 2012

87లక్షల ఫోన్లను హ్యాక్ చేశారు?.....

Hackers steal 8.7 million Korea Telecom subscribers Data
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ ఆపరేటర్ ‘కేటీ’ (కొరియా టెలికామ్) హ్యాకింగ్ గురైంది. కుట్రకు పాల్పడిన ఇద్దరిని ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… ‘కేటీ’కి చెందిన 87 లక్షల మంది వినియోగదారుల వివరాలను హ్యాకర్లు దోచుకున్నారు. స్థానిక ఐటీ కంపెనీకి చెందిన ప్రోగ్రామర్ (వయసు నలభై ఉంటుంది), అతడి సహాయకునితో ఈ చర్యకు ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వినియోగదారు పేరు, ఫోన్ నెంబర్, నివాస ధ్రువీకరణ నెంబర్ వంటి కీలక వివరాలతో నిండి ఉన్న సమాచారాన్ని ఈ హ్యాకర్లు టెలి మార్కెటింగ్ కంపెనీలకు $877,000(దరిదాపు 5కోట్లకు) అమ్ముకుంటున్నట్లు దర్యాప్తులో భాగంగా వెల్లడైంది. జరిగిన అసౌకర్యానికి చింతిస్తూ కొరియా టెలికామ్ యాజమాన్యం తన 1.6కోట్ల మంది చందదారులకు క్షమాపణ చెప్పింది. ఈ విధమైన సంఘటనలను పునరావృతం కానివ్వమని హామి ఇచ్చింది.
మీ పాస్‌వర్డ్‌ భద్రంగా ఉందా..?
ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల ఆగడాల తలబొప్పి కట్టిస్తున్నాయి. ఇటీవల హ్యాకింగ్‌కు గురైన 6 మిలియన్‌లు లింకిడిన్ అకౌంట్ల ఉదంతాన్ని మరవక ముందే సైబర్ క్రిమినల్స్ బృందం 450,000 యాహూ అకౌంట్‌లను హ్యాక్ చేసింది. ఆన్‌లైన్ ద్వారా అలజడి సృష్టిస్తున్న ఈ సైబర్ క్రిమినల్స్ రేపు మీ ఆకౌంట్ల పైనా దాడికి పాల్పడే అవకాశముంది. ఈ విధమైన దాడుల నుంచి మీ ఆకౌంట్‌లను రక్షించుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మీ పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుకునేందుకు పలు చిట్కాలు…
- మీకున్న అన్ని అకౌంట్‌లకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించకుండా వేరు వేరు పాస్‌వర్డ్‌లను కేటాయించండి.
- లావాదేవీలు ముగియగానే ఆకౌంట్‌ను సైన్ అవుట్ చెయ్యటం మరవద్దు.
- యాంటీ వైరస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండండి.
- లైబ్రరీ, ఇంటర్నెట్ కేఫ్ వంటి ప్రాంతాల్లో మీ అకౌంట్ లను ఓపెన్ చేయకండి, ఒక వేళ చెయ్యాల్సి వస్తే పనిముగియగానే సైన్ అవుట్ చెయ్యటం మరవద్దు, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.
- మీ పాస్‌వర్డ్‌ను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. గోప్యత పాటించండి.
- భద్రతలేని వై-ఫై కనెక్షన్లను ఉపయోగించే సమయంలో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయకండి.
- పాస్‌వర్డ్‌లను సంవత్సరానికి ఒకసారైనా మార్చటం అవసరం.

No comments:

Post a Comment