రాష్టప్రతి ఎన్నికల తరువాత పార్టీ, పభుత్వంలో అధిష్ఠానం మార్పులు చేపట్టనుందా? అటు ఢిల్లీ, ఇటు రాష్టన్రేతల్లోనూ చర్చనీయాంశంగా మారిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం లభించకముందే, కిరణ్ మార్పుతో ఖాళీ అయ్యే గద్దెను అందుకోవడానికి పార్టీలోని పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయానికి వీలుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో హైకమాండ్ తలపెట్టే మార్పులెలా ఉంటాయన్నది కచ్చితంగా తెలియనప్పటికీ, కొంతమంది నేతలు మాత్రం సిఎం పదవి కోసం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. సిఎం గద్దెను ఆశిస్తున్న నేతలంతా తెలంగాణకు చెందిన వారే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి మార్పు అంటూ జరిగితే ఈసారి తప్పని సరిగా తెలంగాణ వారికే దక్కవచ్చన్న అభిప్రాయంతో సీమాంధ్రకు చెందిన నేతలు పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న తెలంగాణ ప్రాంత నేతల్లో ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పంచాయతీ రాజ్ మంత్రి కె జానారెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్, కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి ఉన్నారు. వీరిలో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ముందు వరసలో, తరువాతి స్థానంలో శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ల మధ్యే పోటీ గట్టిగా సాగుతోంది.
Political News & latest gadgets , latest automobile news , computers information ,
Sunday, June 24, 2012
సియం కుర్చీ మీద కన్ను !
రాష్టప్రతి ఎన్నికల తరువాత పార్టీ, పభుత్వంలో అధిష్ఠానం మార్పులు చేపట్టనుందా? అటు ఢిల్లీ, ఇటు రాష్టన్రేతల్లోనూ చర్చనీయాంశంగా మారిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం లభించకముందే, కిరణ్ మార్పుతో ఖాళీ అయ్యే గద్దెను అందుకోవడానికి పార్టీలోని పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయానికి వీలుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో హైకమాండ్ తలపెట్టే మార్పులెలా ఉంటాయన్నది కచ్చితంగా తెలియనప్పటికీ, కొంతమంది నేతలు మాత్రం సిఎం పదవి కోసం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. సిఎం గద్దెను ఆశిస్తున్న నేతలంతా తెలంగాణకు చెందిన వారే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి మార్పు అంటూ జరిగితే ఈసారి తప్పని సరిగా తెలంగాణ వారికే దక్కవచ్చన్న అభిప్రాయంతో సీమాంధ్రకు చెందిన నేతలు పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న తెలంగాణ ప్రాంత నేతల్లో ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పంచాయతీ రాజ్ మంత్రి కె జానారెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్, కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి ఉన్నారు. వీరిలో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ముందు వరసలో, తరువాతి స్థానంలో శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ల మధ్యే పోటీ గట్టిగా సాగుతోంది.
ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారైనందున, ఈసారి మార్పు జరిగితే తెలంగాణకే ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌కు అవకాశం కల్పించే సమయంలోనే, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి పేరు సైతం అప్పట్లో ప్రముఖంగానే వినిపించింది. అయితే ముఖ్యమంత్రిగా రావడం తనకు ఇష్టంలేదని అప్పటి పరిస్థితుల్లో సన్నిహితుల వద్ద జైపాల్ వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో హైకమాండ్ దృష్టిలో జైపాల్‌రెడ్డి నిజంగా ఉన్నారో లేదో తెలీదుకానీ, ఆయన ఆసక్తి కనబర్చక పోవడంవల్లే కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ పదవి లభించిందని కాంగ్రెస్‌లోని ఒక వర్గం ప్రచారం చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment