Saturday, August 25, 2012

రెనో స్కాలా ఫస్ట్ లుక్.....

భారత్‌లో జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ అందిస్తున్న సన్నీ సెడాన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని ఫ్రెంచ్ కార్ మేకర్ రెనో ఓ సరికొత్త సెడాన్ (రెనో స్కాలా)ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో మార్కెటోకి రానున్న ఈ కారును కంపెనీ ఇటీవలే మీడియా ముందుంచింది. నిస్సాన్ సన్నీ క్లోన్‌తో వస్తున్న రెనో స్కాలా దాదాపుగా నిస్సాన్ సన్నీ మాదిరిగానే ఉంటుంది.

renault scala scheduled september launch




ఇదిగో.. ఇక్కడున్న ఫోటోలను గమనించండి. ఇవి సరికొత్త రెనో స్కాలా ఫోటోలు. రెనో స్కాలా ముందు భాగం దాదాపుగా రెనో ఇండియా అందిస్తున్న చిన్న కారు రెనో పల్స్ హ్యాచ్‌బ్యాక్‌‌ను వెనుక భాగం నిస్సాన్ సన్నీ సెడాన్ పోలి ఉంది. ముందువైపు సరికొత్త క్రోమ్ గ్రిల్ బార్, రెనో బ్యాడ్జ్, కొత్త ఫాగ్‌ల్యాంప్స్, స్టయిలిష్ హెడ్‌లైట్స్, కొత్త బానెట్ వంటి మార్పులను గమనించవచ్చు.

ఇంటీరియర్స్‌లో కూడా దాదాపు నిస్సాన్ సన్నీలో ఉపయోగించిన వాటినే ఇందులోనూ ఉపయోగించారు. సన్నీలో ఉపయోగించిన డ్యాష్ బోర్డ్, రీ బ్యాడ్జ్‌డ్ స్టీరింగ్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్, లోపలివైపు డోర్ హ్యాండిల్స్, సీట్ కవర్స్ వంటి ఫీచర్లను రెనో స్కాలాలో గమనించవచ్చు. అలాగే, ఇంజన్ విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. సెప్టెంబర్ నెలలో దీపావళి కానుకగా రెనో స్కాలా భారత ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేయనుంది.

No comments:

Post a Comment