Tuesday, August 21, 2012

పుట్టిన రోజు పేరుతో ఇంట్లో రేవ్ పార్టీ....

 8 Girls Arrested Rave Party
రాజధాని హైదరాబాదు నగర పరిసరాల్లోని ఘట్‌కేసర్‌లో జరుగుతున్న ఓ రేవ్ పార్టీ పైన పోలీసులు దాడులు చేశారు. పార్టీ పేరుతో అసభ్యకర నృత్యాలు చేస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలపై కేసు నమోదు చేశారు. పుట్టిన రోజు సందర్భంగా ఎనిమిది మంది యువతులు, మరికొంత మంది యువకులు కలిసి ఘట్‌కేసర్ సమీపంలోని వెంకటాద్రి టౌన్ షిప్‌లోని ఓ ఇంట్లో రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పేరుతో వారు అసభ్యకర నృత్యాలు చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. యువతీ యువకులతో పాటు హుక్కా సామాగ్రిని, నాలుగు మద్యం బాటిళ్లను పోలీసులు సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు.

No comments:

Post a Comment