Wednesday, August 22, 2012

లక్ష్మణ్ రిటైర్మెంట్ గురించి నాకు తెలియదు :ధోనీ....





వివియస్ లక్ష్మణ్‌తో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి విభేదాలు ఉన్నాయనే విషయం బయటపడింది. హైదరాబాద్ మణికట్టు మాంత్రికుడు వివియస్ లక్ష్మణ్ ధోనీ తీరుపై అసంతృప్తితోనే రిటైర్మెంట్ ప్రకటించారనే ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి. అయితే, అవి ఊహాగానాలు మాత్రమే కాదని, నిజమని ధోనీ మాటలను బట్టి తేలింది. అంతేకాకుండా, క్రికెటర్లకు తన నివాసంలో ఇచ్చిన విందుకు లక్ష్మణ్ ధోనీని ఆహ్వానించలేదు.

లక్ష్మణ్ రిటైర్మెంట్ వ్యవహారంపై ధోనీ బుధవారం హైదరాబాద్‌లో స్పందించారు. లక్ష్మణ్ ఎందుకు రిటైర్ అయ్యారో తనకు తెలియదన్నారు. అలాగే, లక్ష్మణ్ తనను డిన్నర్‌కు ఆహ్వానించలేదని, సచిన్, సెహ్వాగ్, గంభీర్, జహీర్‌ ఖాన్‌లను మాత్రమే పిలిచాడని చెప్పుకొచ్చాడు. 

ఆయన రిటైర్మెంట్ ప్రకటన కన్నా హైదరాబాదులో జరిగే మ్యాచులో ఆడనని చెప్పడమే ఎక్కువగా అందరినీ అశ్చర్యపరిచింది. ఏదో జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. లక్ష్మణ్‌ను బాధపెట్టిన సంఘటన ఏదో జరిగి ఉంటుందని భావిస్తూ వచ్చారు. గురువారంనాటి ధోనీ మాటలు అందులోని నిప్పును తెలియజేస్తున్నాయి.

ఈనెల 23వ తేదీ నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్ట్ సిరీస్‌కు ముందు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేసిన విషయం తెల్సిందే. ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్ ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక కెప్టెన్ ధోనీతో పాటు.. బోర్డు పెద్దల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే.

No comments:

Post a Comment