Sunday, August 26, 2012

నారంగ్, సైనా నెహ్వాల్‌కు డీఎల్‌ఎఫ్‌ Audi Q5 కార్లు.....

 Olympic Medalists From Haryana Get Audi Q5
లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఇటీవలే హైదరాబాద్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదగా ఆడి కారుని అందుకున్న సైనా నెహ్వాల్‌తో పాటు ఒలింపిక్ పతక విజేతలు గగన్ నారంగ్, సుశీల్‌కుమార్‌, యోగేశ్వర్‌దత్‌లకు రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ హర్యానా ప్రభుత్వంతో కలిసి విలాసవంతమైన ఆడి 5 కారు బహుకరించనుంది.

దీంతో పాటు డీఎల్‌ఎఫ్‌ మారుతి సుజుకీకి చెందిన మిడ్‌ సైస్‌ సీడాన్‌ కారు ఎస్‌ 4 కారును హర్యానా నుంచి లండన్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్నవారికి బహుకరిస్తారు. అయితే వారెవ్వరూ ఎలాంటి పతకాలను గెలవని వారికి మారుతి మిడ్‌ సైజ్‌ కారు బహుకరించాలని కంపెనీ నిర్ణయించింది. హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హుడా రాష్ట్రప్రభుత్వం సోనీపట్‌ లో ఏర్పాటు చేసిన సన్మానం కార్యక్రమంలో ఈ కార్లను ఈరోజు బహుకరిస్తారు.

భారత్‌ లండన్ ఒలంపిక్స్‌లో ఆరు పతకాలను గెలిచిన విషయం తెలిసిందే. ప్రముఖ రియల్టీ సంస్థ పలు క్రీడలకు స్పాన్సర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) క్రికెట్‌ క్రీడకు ప్రారంభం నుంచి డీఎల్‌ఎఫ్‌ స్పాన్సర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో గోల్ఫ్‌ క్రీడను ప్రోత్సహించేందుకు కంపెనీ ముందుకు వచ్చింది.

No comments:

Post a Comment